ముగించు

మండలము

ఈ ఉపవిభాగము మండలాలుగా విభజించబడినది. ఒక్కక్క మండలానికి తహసిల్దారు అధికారిగా వుండును.

గత కాలములో తాటాకులపై న్యాయపరమైన అధికారములు కలిగిన తహసీల్దార్లు ఉండేవారు. అదే అధికారములతోను, విధులతోను నేటి మండల రెవిన్యూ అధికారాలు పనిచేయుచున్నారు. మండల రెవిన్యూ కార్యాలయమునకు మండల రెవిన్యూ అధికారి వుంటాడు. మండల రెవిన్యూ అధికారి తన అధికార పరధిలో వున్న ప్రభుత్వము మరియు ప్రజల మధ్య సమన్వయము కుదుర్చును. ఇతడు తన అధికార పరిధిలో సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టును. సమాచారము సేకరించుటలోను, విచారణలు జరుపుటలోను, ఉన్నత అధికారులకు మండల రెవిన్యూ అధికారి సహకరించును పరిపాలనలో ఉన్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకొనుటకు జిల్లా పరిపాలనకు తన అభిప్రాయములను వెల్లడిపరుచును.

డిప్యూటీ తహసీల్దార్ లేక సూపరింటెండెంట్ (పర్యవేక్షణాధికారి), మండల రెవిన్యూ ఇన్ స్పెక్టర్, సూపరింటెండెంట్, మండల సర్వేయర్, సహాయ గణాలకు అధికారి మరియు ఇతర మంత్రివర్గ సిబ్బంది. డిప్యూటీ తహసిల్దార్ మండల రెవిన్యూ కార్యాలయములో రోజువారీ పనులను పర్యవేక్షించును మరియు ముఖ్యముగా సామాన్య పరిపాలనలో పాల్గొనును. చాలా దస్త్రములు ఇతని ద్వారానే జరుగును. మండల రెవిన్యూ కార్యాలయములో అన్ని విభాగములు ఇతని ద్వారా పర్యవేక్షించబడును.

మండల రెవిన్యూ ఇన్ స్పెక్టర్ విచారణలు జరుపుటలో, తనిఖీలు చేయుటలో మండల రెవిన్యూ అధికారికి సహకరించును. ఇతడు గ్రామా కార్యదర్శులను పర్యవేక్షించును. ఇతడు పంటపొలాలను తనిఖీచేయును (అజిమాయిషి), షరాలు, పహనీలో వ్రాయును (క్షేత్ర తనిఖీల వివరములు). ఇతడు భూమి శిస్తును, వసూలు చేయును, వ్యవసాయేతర భూముల విశ్లేషణ మరియు బకాయిలు, మొదలగు వాటిని తన న్యాయపరిధిలో చట్టము మరియు ఆజ్ఞ కొరకు గ్రామములను పరిశీలించును. రాష్ట్రస్థాయిలో జిల్లా మరియు డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ లో ముఖ్య ప్రణాళిక అధికారి అద్వర్యంలో పనిచేయు సహాయ గణాంక అధికారి వర్షపాతము, పొలాలు, జనభాకు సంబందించిన వివరములను సేకరించును. ఇతడు పంటల అంచనా పరీక్షలను నిర్వహించును. ఇతడు పంట పొలాల యొక్క స్థితుల వివరములను సేకరించుటకు పంటపొలాలను తనిఖీ చేయును. ఇతడు జనన మరణ వివరముల ఆవర్తక నివేదికలు తయారుచేయును. కాలానుగుణముగా ప్రభుత్వము నిర్వహించు పశు గణాంకములు, జనాభా లెక్కలు ఇతర సర్వేలు జరుపుటలో మండల రెవిన్యూ అధికారికి సహకరించును. మండల రెవిన్యూ అధికారి ఫై విషయములకు సంబంధించిన నివేదికను జిల్లా కలెక్టరుకు అందజేయును. తరువాత ఈ నివేదికలు ఎకనామిక్స్ మరియు స్టాటిస్టిక్స్ మరియు ప్లానింగ్ శాఖలకు పంపించబడును.

సర్వే సెటిల్ మెంట్ మరియు ల్యాండ్ రికార్డుల శాఖకు చెందిన మండల సర్వేయరు సర్వే కార్యకలాపాలలో మండల రెవిన్యూ అధికారి సహకరించును.

మండల సర్వేయరు విధులను నిర్వహించుటలో చైనమేన్ సహకరించును.

నిర్వహణ సంస్కరణల ప్రకారము, తహసీల్దార్ కార్యాలయములో గల వివిధ విభాగములు.

విభాగము ఎ : కార్యాలయము పద్ధతి మరియు ఆర్ధిక కార్యాకలాపాలు.

విభాగము బి : భూ సంబంధ కార్యకలాపాలు.

విభాగము సి : పౌర సరఫరాలు, పింఛను పధకాలు మొదలగున్నవి.

విభాగము డి : స్థాపన, ప్రకృతి వైపరీత్యాలు.

విభాగము ఇ : కుల, ఆదాయ, స్థానికతకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు జారీచేయుట.

మండల తహసిల్దార్ వివరాలు
క్రమ సంఖ్య మండలం   పేరు తహశీల్దార్   ఫోన్ నంబర్
1 పుట్టపర్తి 9493188861
2 బుక్కపట్నం 9493188863
3 కొత్తచెరువు 9493188862
4 నల్లమాడ 9493188876
5 ధర్మవరం 9493188840
6 బత్తలపల్లె 9493188842
7 తాడిమర్రి 9493188841
8 ముదిగుబ్బ 9493188875
9 రామగిరి 9493188845
10 కనగానపల్లి 9493188844
11 చెన్నేకొత్తపల్లి 9493188843
12 తలుపుల 9493188878
13 నంబులపూలకుంట 9493188877
14 గాండ్లపెంట 9493188883
15 కదిరి 9493188874
16 ఓబులదేవరచెరువు 9493188880
17 నల్లచెరువు 9493188879
18 తనకల్ 9493188881
19 అమడగూర్ 9493188882
20 రోడ్డం 9493188860
21 మడకశిర 9493188864
22 అమరపురం 9493188865
23 గుడిబండ 9493188866
24 రోల్లా 9493188867
25 ఆగాలి 9493188868
26 పరిగి 9493188870
27 పెనుకొండ 9493188858
28 గోరంట్ల 9493188873
29 సొమ్మండేపల్లి 9493188859
30 హిందూపూర్ 9493188869
31 లేపాక్షి 9493188871
32 చిలముత్తూరు 9493188872